calender_icon.png 7 November, 2024 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక పర్యాటక క్షేత్రంగా రామగిరి ఖిల్లా

03-11-2024 07:07:12 PM

మంథని,(విజయక్రాంతి): రామగిరి ఖిల్లా ఎంతో ప్రాచీన సంస్కృతి కలదని, అటువంటి రామగిరి ఖిల్లాను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి  శ్రీధర్ బాబు సహకారంతో ఇక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు.  ఆదివారం రామగిరి మండలంలోని ఖీల్లాను ఆయన నాయకులు, కార్యకర్తలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా దుద్దిళ్ల శ్రీను బాబు మాట్లాడుతూ... ఖిల్లా అభివృద్ధికి మంత్రి శ్రీధర్ బాబు రూ.5 కోట్ల నిధులు ప్రభుత్వం నుంచి కేటాయించాడని, శ్రీను బాబు అన్నారు. బేగంపేట లో పెద్దమ్మ దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మంత్రి శ్రీధర్ బాబు  నాయకత్వంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు యువతకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని శ్రీనుబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, కిసాన్ సెల్ ల్ జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి, పార్టీ  మండల అధ్యక్షులు వైనాల రాజు, రోడ్డ బాపు, దొడ్డ బాలాజీ, కాంగ్రెస్ నాయకులు తోట చంద్రయ్య, ఆరెల్లి కొమురయ్య గౌడ్, బర్ల శ్రీనివాస్,  ముస్తాల శ్రీనివాస్, కాటం సత్యం, పాల్గొన్నారు.