calender_icon.png 20 April, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ యాత్ర

11-04-2025 12:00:00 AM

కాటారం, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) :  రాజ్యాంగ పరిరక్షణకై కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ధర్మ సాగర్, మల్లారం, రఘు పెళ్లి, గూడూరు, గుండ్రాత్ పెళ్లిలో ఈ కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఇంటింటా జైత్రయాత్ర వివరా లను తెలియజేస్తూ కార్యకర్తలు పాద యాత్ర చేపట్టారు.

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు, శ్రీనుబాబు సూచనల మేరకు నియోజకవర్గంలో కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్, చీటూరి మహేష్ గౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, అయిత శకుంతల, కొట్టే ప్రభాకర్, అంగజాల అశోక్, కుంభం రమేష్ రెడ్డి, చీర్ల తిరుపతిరెడ్డి, బోడ నరేష్ తదితరులు పాల్గొన్నారు.