calender_icon.png 8 January, 2025 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ x బీజేపీ నాంపల్లిలో నుమాయిష్!

08-01-2025 01:35:50 AM

  1. ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేశ్ బిధూరి వ్యాఖ్యలపై దుమారం
  2. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన 
  3. గాంధీభవన్ ముట్టడికి బీజేపీ శ్రేణుల యత్నం 
  4. రెండు పార్టీల మధ్య బాహాబాహీ
  5. లాఠీచార్జి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాం తి): ‘నన్ను ఎన్నికల్లో గెలిపిస్తే ఢిల్లీ రోడ్లను కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ బుగ్గు ల్లా నున్నగా చేస్తా’నని బీజేపీ నేత రమేశ్ బిధూరి ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. రమేశ్ వ్యాఖ్యలపై కాం గ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

దీనిలో భాగంగా మంగళవారం కాం గ్రెస్ శ్రేణులు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్నది. రెండు పార్టీ నేతల మధ్య తోపులాటకు దారి తీసింది. ఘర్షణలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లుతో పాటు కొం దరు పార్టీ నేతలు గాయాలపాలయ్యారు.

పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. తెలిసిన వివరా ల ప్రకారం.. ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేశ్ బిధూరి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం హైదరాబాద్‌లో ఆందోళనలు చేప ట్టాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ పిలుపునిచ్చారు.

గాంధీభవన్ నుంచి నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ప్రదర్శనగా బయల్దేరాలని నిర్ణయించారు. కానీ.. గాంధీభవన్ నుంచి బయల్దేరే క్రమం లో పోలీసులు వారిని అడ్డుకుంటారని అంచనా వేసిన ఎన్‌ఎస్‌యూఐటీ నేతలు సరాసరి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయాన్ని ముట్టడించేం దుకు యత్నించారు.

సమాచారం అందుకు న్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడే ఉన్న బీజేపీ కార్యక ర్తలు ఎదురు దాడికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రెండు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నాయి. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

దాడిలో బీజేపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, పార్టీ ఓబీసీ మోర్చా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, కార్యకర్త నందుకి గాయాలయ్యాయి. పోలీసులు లాఠీచార్జి చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

గాంధీభవన్ ముట్టడికి బీజేపీ యత్నం..

నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఉద్రిక్తత తర్వాత బీజేపీ యువ మోర్చా నేతలు గాంధీభవన్‌ను ముట్టడించాలని భారీ ప్రదర్శనగా బయల్దేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీజేపీ యువ మోర్చా నేతలు కదలనీయకుండా గాంధీభవన్‌లోని అన్ని దారులను మూసివేశారు.

అయినప్పటికీ ఇతర  మార్గాల నుంచి దాడి కి వెళ్తారనే అనుమానంతో ఎక్కడికక్కడ పలువురిని అరెస్టు చేశారు. కొద్దిసేపటి తర్వాత కొద్దిమంది బీజేపీ యువమోర్చ నేత లు గాంధీభవన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక ఫ్లెక్సీలను చించేశారు. దీంతో ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు మళ్లీ లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది.

రెండు పార్టీల మధ్య ఘర్షణ కారణంగా నాంపల్లి మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచింది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ఘర్షణలో గాయపడి నాంపల్లి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లును ఆ పార్టీ నేతలు రాంచందర్‌రావు, ఎన్వీ సుభాశ్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పరామర్శించారు.

బీజేపీ తలచుకుంటే కాంగ్రెసోళ్లు రోడ్లపై తిరగలేరు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బీజేపీ రాష్ట్ర కార్యాలయ ముట్టడిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. కాంగ్రెసోళ్లు పోలీసులను వెంట తీసుకుని మరీ తమ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలై దాడి చేస్తున్నా పోలీ సులు ప్రేక్షకపాత్ర వహించారని మండిపడ్డారు. దాడిపై వెంటనే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించాలని డిమాండ్ చేశారు.

బీజేపీ తలుచుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలెవరూ రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు. దేశంలో ఇప్పటికే కాం గ్రెస్ కనుమరుగవుతున్నదని, ఈ కారణంతోనే ఆ పార్టీ నేతలు భౌతిక దాడు లకు పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఇలాంటి చేష్టలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించరని, సీఎం రేవంత్‌రెడ్డి దాడి ఘటనపై సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

గాంధీభవన్ పునాదులు కూడా మిగలవు

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తున్నట్లు కేంద్ర మం త్రి బండి సంజ య్ తెలిపారు. దాడులను చూసి బీజేపీ సహించదని, తమ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే గాంధీభవన్ పునాదులై నా మిగలవని హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

సర్కార్ రాళ్ల దాడులను ప్రోత్సహించాలనుకుంటున్నదా? అని నిలదీశారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని హితవు పలికారు. ఎవరిపైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే, వాటిని ఖండించాల్సిందేనని.. కానీ.. చట్టాన్ని చేతులోకి తీసుకోవద్దని సూచించారు. ప్రభుత్వం వెంటనే తమ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 

పార్టీ ఆఫీసులపై దాడులు సరికాదు

యూత్ కాంగ్రెస్ నేతలను మందలించిన పీసీసీ చీఫ్ 

హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి) : బీజేపీ ఆఫీసుపై యూత్ కాంగ్రెస్ నేతలు చేసిన దాడిపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ స్పందించారు. ఈ విషయంలో యూత్ కాంగ్రె స్ నాయకులకు ఆయన తీవ్ర హెచ్చరికలు చేశా రు. నిరసనలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులపై బీజేపీ నేతలు చేస్తు న్న వ్యాఖ్యలను ఖం డించాల్సిందేనని, కానీ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం సరికాదన్నారు. ఇదే అదనుగా భావించి గాంధీభవన్‌పై బీజేపీ నేత లు దాడి చేయడం సరికాదని మహేష్‌కుమార్‌గౌడ్ హితవు పలికారు. శాంతి భద్రతల విషయంలో బీజేపీ నేతలు సహకరించాలని ఆయన కోరారు.

కాగా, ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా  బీజేపీ నేత రమేష్ బిధూరీ  కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీపై చేసిన వివాదస్ప ద వ్యాఖ్యలను పీసీసీ చీఫ్  తీవ్రంగా ఖండించారు. ప్రియాంకగాంధీపై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.