మహారాష్ట్రలో ప్రచారంలో మాట్లాడిన రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు
కామారెడ్డి, ( విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కష్టపడి పని చేస్తేనే కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని తెలంగాణ రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని దే గుల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బిలోలి తాలూకా భామిని గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. దే గులుర్ శాసనసభ కాంగ్రెస్ అభ్యర్థి నివర్తి రావును గెలిపించాలని కోరారు.