- జైపాల్‌రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
- పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తీరుపై కాంగ్రెస్ నేతల ఫైర్
పటాన్చెరు, జనవరి 21 : ‘ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి గారూ ఇంతకు మీది ఏ పార్టీ...! కాంగ్రెస్సా...బీఆరెస్సా చెప్పండి’ అం కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. మంగళవారం అమీన్పూర్లో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కాట శ్రీనివాస్‌గౌడ్ నివాసంలో పటాన్చెరు నియోజ కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బొల్లారం మున్సిపల్లో అభివృద్ధి కార్యక్రమాల షెడ్యూల్‌ను కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, కౌన్సిలర్ చంద్రారెడ్డికి సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే మహిపాల్.. బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్ భర్తను సంప్రదించి షెడ్యూల్ ఖరారు చేశారని వారు ఆరోపించారు.
కాం ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ నాయకులతో తిరుగుతూ కాంగ్రెస్ నాయకులు, కార్య దూరం పెట్టడం ఏంటని తప్పుబట్టారు. మున్సిపల్ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు దాడికి యత్నించడాన్ని ఖండించారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతు మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకొని పటాన్చెరు క్యాంప్ ఆఫీసులో సీఎం ఫోటో పెట్టకపోవడం ఏంటన్నారు.
ఈ విషయమై హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్ చంద్రారెడ్డి, బొల్లారం మున్సి అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, జిన్నారం మం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, మండల అధ్యక్షుడు వడ్డె కృష్ణ, గుమ్మడిదల అధ్యక్షుడు నర్సింగ్‌రావు పాల్గొన్నారు.