calender_icon.png 19 April, 2025 | 12:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ కార్యకర్తకు గాయాలు

17-04-2025 09:37:14 PM

పరామర్శించిన మాజీ మున్సిపల్ చైర్మన్

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మహేష్ గురువారం ప్రమాదవశాత్తు బైక్ మీద నుంచి పడ్డారు. తలకు, చెవికి  బలమైన గాయాలు తగిలాయి. వెంటనే అతనిని ఎల్లారెడ్డి పట్టణంలోని వెంకటేశ్వర హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. ఈ  విషయం తెలుసుకున్న వెంటనే హాస్పిటల్ కి చేరుకున్న  మాజి మున్సిపల్ చైర్మన్ కుడుములు సత్యనారాయణ డాక్టర్ నాగేశ్వర్ రావు తో మాట్లా డారు. మెరుగైన వైద్యం అందించాలని మహేష్  యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారి కుటుంబాన్ని పరామర్శించిి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు. వారితోపాటు మాజీ జెడ్పిటిసి సామెల్, ఎల్లారెడ్డి పట్టణం చెందిన యెల్లారెడ్డి మండల మాజీ అద్యక్షుడు అజార్, సీనియర్ నాయకులు ఈశ్వర్,బ్రాహ్మణపల్లి మాజీ సర్పంచ్ బాలయ్య తదితరులు ఉన్నారు.