calender_icon.png 4 April, 2025 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ అప్రజాస్వామిక విధానంపై కాంగ్రెస్ పోరు: వినోద్

28-03-2025 12:09:49 AM

ప్రతీ ఇంటికీ జైబాపు, జైభీమ్ నినాదం తీసుకెళ్తాం: కేఎల్‌ఆర్

మహేశ్వరం, మార్చి27(విజయ క్రాంతి)..దేశంలో ప్రధాని నరేంద్రమోడీ పాలన అప్రజాస్వామికంగా కొనసాగుతుందని జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ కార్యక్రమం ఇన్ఛార్జి వినోద్ అన్నారు. గురువారంతుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వినోద్ మాట్లాడారు..భారత రాజ్యాంగం, అంబేద్కర్ పై హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ చేస్తున్న అంతర్గత దాడి, దేశాన్ని ముక్కులు చేసే కుట్రపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం దేశవ్యాప్తంగా ఓ ఉద్యమాన్ని చేపట్టిందన్నారు.

అనంతరంమహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... కులగణన చేసి తెలంగాణలో రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు కల్పించి సీఎం రేవంత్ రెడ్డి దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.రాజ్యాంగం కల్పించిన అన్ని రాజకీయ అవకాశాలు ప్రతీ ఒక్కరికీ దక్కేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

స్వాతంత్య్ర పితామహుడు గాంధీజీని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను దేశం మరిచిపోయేలా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుట్రలు చేస్తుందని లక్ష్మారెడ్డి ఆరోపించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ఛైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, సీనియర్ నాయకులు దేపభాస్కర్ రెడ్డి, మాజీ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ కృష్ణానాయక్, ఏనుగు జంగారెడ్డి, జేఏసీ ఛైర్మన్ రఘుపతి, వైఎస్ ఛైర్మన్ చాకలి యాదయ్య,

డైరెక్టర్లు గోవర్దన్ రెడ్డి, మధుసూదన్ రావు, శివగళ్ల యాదయ్య, నాగేందర్ రెడ్డి, సుభాన్ యాదవ్, ఎస్సీ సెల్ నరసింహ, శ్రీధర్, బోయిన శంకర్ యాదవ్, పున్నా గణేష్, భాస్కర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, బాల్ రెడ్డి, సరికొండ జగన్, పాండు సహా కాంగ్రెస్ నాయకులు, మహిళ నేతలు పాల్గొన్నారు.