calender_icon.png 12 January, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిచ్చురేపిన విగ్రహాల వివాదం

06-09-2024 02:17:05 PM

దుబ్బాక లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్

దుబ్బాక (విజయక్రాంతి): దుబ్బాకలో మాజీ ఎమ్మెల్యేల విగ్రహల వివాదం చిచ్చురేపింది. దుబ్బాక అభివృద్ధి దివంగత మాజీమంత్రి చెరుకు ముత్యం రెడ్డి తోనే సాధ్యం అయ్యిందని దుబ్బాక కాంగ్రెస్ నాయకులు  స్థానిక బస్టాండ్ వద్ద అయన విగ్రహఏర్పాటుకు భూమిపూజ చెయ్యడానికి పిలుపునివ్వగా, బీఆర్ఎస్ నాయకులు అదే ప్లేస్ లో రామలింగారెడ్డి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజా చేయడం తో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. స్వర్గీయ మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి  విగ్రహ భూమి పూజ ఉండంగా కొంతమంది బీఆర్ఎస్ గుండా నాయకులు కావాలని రామలింగారెడ్డి విగ్రహం గురించి కొబ్బరికాయ కొట్టడం జరిగిందని  దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. 

గతంలో జిల్లా కలెక్టర్, దుబ్బాక మున్సిపల్ కమిషనర్ కి ముత్యం రెడ్డి విగ్రహం ఏర్పాటుకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కావాలనే శాంతిభద్రతలకు విఘాతం కలగించి అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో రామలింగారెడ్డి విగ్రహం పేరుతో ప్రయత్నం చేసారన్నారు.  ముత్యం రెడ్డి  విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ట చేసేదాకా విడిచి పెట్టేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మరియు పోలీసుల మీద  దాడి చేసి బలవంతంగా కొబ్బరికాయ కొట్టినటువంటి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ అనుచర గుండాలను కఠినంగా శిక్షించి జైలుకు పంపించాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు.