calender_icon.png 1 October, 2024 | 7:48 AM

కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్

01-10-2024 01:13:48 AM

తెలంగాణ భవన్ వద్ద ఇరుపక్షాల పరస్పర దాడులు

నయీం బ్రిడ్జిపై వివాదంపై హనుమకొండలోనూ ఇరువర్గాల మధ్య ఘర్షణ

హైదరాబాద్/ హనుమకొండ, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ నాయకులు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారంటూ సోమవారం కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణభవన్ వద్ద నిరసన తెలపడంతో ఉద్రికత్త చోటు చేసుకుంది.

ఈసమయంలో ఇరుపార్టీల నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చో టు చేసుకుంది. ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు లు ఇరు పార్టీల నేతలను చెదరగొట్టారు. 

హనుమకొండలో..

హనుమకొండలోని నయీంనగర్ బ్రిడ్జి నిర్మాణం విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బ్రిడ్జి నిర్మాణం విషయంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తాము బ్రిడ్జి కడితే ప్రస్తుత ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాలాభిషేకాలు చేయించుకుంటు న్నారని కేటీఆర్ కామెంట్స్ చేశారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే నాయిని ఆదివారం మీడియా సమావేశంలో కేటీఆర్‌కు బ్రిడ్జ్ వద్దకు రావాలని సవాలు విసిరారు. ఈ నేపథ్యంలో వినయ్ భాస్కర్ తన అనుచరులను వెంటబెట్టుకుని సోమవారం బ్రిడ్జి వద్దకు వచ్చారు.

కాంగ్రెస్ శ్రేణులు కాడా రావడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను శాంతిపజేసే ప్రయత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులను అదుపులో తీసుకొని పీఎస్‌కు తరలించారు.