11-04-2025 08:07:34 PM
చేగుంట కోఆర్డినేటర్ మల్లారెడ్డి
చేగుంట,(విజయక్రాంతి): రాజ్యాంగ పరిరక్షణకై కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కొండాపూర్, బోనాల గ్రామంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ తో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటా జైత్రయాత్ర వివరాలను తెలియజేస్తూ కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, జనరల్ సెక్రటి మొజామిల్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్, గ్రామ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.