calender_icon.png 17 March, 2025 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు దగ్గుల నాగిరెడ్డి

17-03-2025 01:34:44 PM

తల్లాడ,(విజయక్రాంతి): తల్లాడ మండలంలో సీసీ రోడ్లు కు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నీలాద్రి ఆలయ డైరెక్టర్ దగ్గుల నాగిరెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. బస్టాండ్ వెనుక ప్రాంతంలో సీసీ రోడ్డు నూతనంగా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. అనంతరం దగ్గుల నాగిరెడ్డి మాట్లాడుతూ... సీసీ రోడ్లు లేక స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, దాని దృష్టిలో పెట్టుకొని రోడ్డు వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు యాచ వరకు విజయ రెడ్డి, గుండ్ల కృష్ణ, పంతంగి శ్రీనివాస్, కందికొండ నర్సిరెడ్డి, కోటేరు సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.