ఎన్నికల్లో సవరణలపై పిటిషన్
దాఖలు చేసిన జైరాం రమేశ్
ఈసీవి ఏకపక్ష నిర్ణయాలు
సవరణలు ఎన్నికల పారదర్శకతకు విఘాతం
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో మార్పులు చేయడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ)పై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల నియమావళి 1961కి ఇటీవల సీఈసీ సవరణలు చేయడం పై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మంగళవా రం సుప్రీంలో పిటిషన్ వేశారు. ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులు, సీసీ టీవీ ఫుటీజీ, వెబ్ కాస్టింగ్ ఫుటేజీ, వీడియో రికార్డింగ్‌లను ఎవరైనా తనిఖీ చేయడంపై ఈసీ నిషేధం విధించింది. అంతేకాకుండా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో ఈసీ మార్పులు చేసింది.
ఎన్నికల ప్రక్రియకు భంగం..
రూల్ 93కి సవరణల కారణంగా ఎన్నిక ల ప్రక్రియ సమగ్రతకు భంగం కలగవచ్చని కాంగ్రెస్ పేర్కొన్నది. ఎన్నికల్లో పారదర్శకతకు ఇది విఘాతమని పేర్కొంటూ ఎన్నికల నిబంధనలను మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
పారదర్శకతకు ఈసీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించింది. కోర్టు తీర్పును పాటించాల్సిన ఈసీ.. ఇందుకు విరుద్ధంగా ఎన్నికల నిబంధనలకు సవరణ చేయడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని జై రాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించా ల్సిన ఈసీ ఏకపక్షంగా ప్రజలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా మార్పులు చేయ డం దారుణమని మండిపడింది.
కాగా ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లను ఏకపక్షంగా చేర్చడం లేదా తొలగించడం వంటి చర్యలకు పాల్పడలేదని కాం గ్రెస్‌కు ఈసీ తెలియజేసింది. ఓటర్ల జాబితా తయారీలో పారదర్శకత, నిబంధనలు పాటించామని, ఓటర్ల తొలగింపులో అవకతవకలు జరగలేదని ఈసీ స్పష్టం చేసింది.
ఎలక్ట్రానిక్ రికార్డులకు మినహాయింపు
కొత్త సవరణతో ఎలక్ట్రానిక్ రికార్డులు మినహా ఇతర పత్రాలు, డాక్యుమెంట్లు తనిఖీకి అందుబాటులో ఉంటాయి. పోలింగ్ బూత్‌లలోని సీసీ టీవీ ఫుటేజీల తనిఖీ వల్ల ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతుండడం తో నిషేధం విధించామని ఈసీ పేర్కొన్నది. అలాగే సీసీ ఫుటేజీని ఉపయోగించుకుని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సహాయం తో ఫేక్ వీడియోలను తయారు చేస్తున్నారని ఈసీ వెల్లడించింది. రూల్ 93కి సవరణ చేసిన తరువాత కూడా అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ రికార్డులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కానీ అభ్యర్థులు కాని వారికి తని ఖీ చేయడానికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది.
ఈసీ సిఫారసు మేరకే..
ఈసీ సిఫారసుల మేరకు ఎన్నికల నియమావళి రూల్ 93(2)పే కేంద్ర న్యాయశాఖ సవరిచింది. ఓ కోర్టు కేసు కారణంగానే ఈ సవరణ చేశామని ఈసీ, న్యాయశాఖ గత శుక్రవారం ప్రకటించాయి.
తనిఖీపై నిషేధం..
గతంలో ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అవకాశం ఉండేది. అయితే ఈసీ ఈ రూల్‌కు సవరణ చేసింది. కొత్త రూల్ ప్రకారం ఇక నుంచి పోలింగ్‌కు సం బంధించిన సీసీ ఫుటేజీని, వెబ్ కాస్టింగ్ రికార్డులను, అభ్యర్థులకు చెందిన వీడి యో రికార్డులను తనఖీ చేయకుండా నిషేధం విధించింది.