కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు
కరీంనగర్, జనవరి 31 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి పేరును ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ప్రక నరేందర్‌రెడ్డితోపాటు పలువురు రేసులో ఉండగా సర్వేలో నరేందర్‌రెడ్డి అయితేనే గెలుస్తాడని తేలడంతోపాటు మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన పేరును సూ చించడంతో టికెట్ కేటాయించింది.
ప్రతం ఈ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఈసారి పోటీపై జీవన్‌రెడ్డి సుముఖంగా లేకపోవడంతో నరేందర్‌రెడ్డికి టికెట్ వరిం ది. నరేందర్‌రెడ్డికి తోడుగా నాలుగు ఉమ్మడి జిల్లాల (కరీంనగర్, ఆదిలాబాద్)కు చెందిన ఎమ్మె టు మంత్రులు శ్రీధర్‌బాబు, పొ ప్రభాకర్, దామోదర రాజనరసింహ, విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు ప్రచారంలో పాల్గొననున్నారు.
అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేతగా నరేందర్‌రెడ్డి ప్రజలకు సుపరిచితులు. కరీంనగర్ తోపాటు ఉత్తర తెలంగాణలో 44 బ్రాంచిలను ఏర్పా చేసి తెలంగాణలో పేరొంది న విద్యాసంస్థగా అల్ఫోర్స్‌ను తీర్చిదిద్దారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరీంనగర్ టికెట్ ఆశించినా దక్కలేదు. ఎమ్మెల్సీ టికెట్‌పై నజర్ వేసి అధిష్టానాన్ని మెప్పించి టికెట్ సాధించారు. తనకు టికెట్ లభించడంపై నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ తన విజ యాన్ని గిఫ్టుగా సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి అందిస్తానని తెలిపారు. తనకు ఆశీస్సులు అందించిన మంత్రులకు, ఎమ్మెల్యే లకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ప్రచారం చేస్తానన్నారు.