calender_icon.png 22 April, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్‌ను అడుగడుగునా అవమానించిన పార్టీ కాంగ్రెస్

22-04-2025 12:00:00 AM

  1. భారతరత్న ఇవ్వకుండా, ఎన్నికల్లో ఓడించిన దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్
  2. అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న పార్టీ బీజేపీ

కరీంనగర్, ఏప్రిల్21(విజయక్రాంతి): భారతదేశ చరిత్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎదుర్కొన్న అవమానాలు మరెవరూ ఎదుర్కోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

ఎన్ని అవమానాలు ఎదురైనా, అడుగడుగునా హేళనకు గురైన వాటినే సోపానాలుగా చేసుకుంటూ అనుకున్న లక్ష్యానికి చేరుకోవడంతోపాటు తన చదువునంతా సమాజ శ్రేయస్సుకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ధారపోసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. చిన్న సమస్య, అవమానాలు ఎదురైతే లక్ష్య సాధన నుండి పక్కకు తప్పుకుంటున్న నేటి తరానికి అంబేద్కర్ జీవితమే స్పూర్తిదాయకమన్నారు. అంబేద్కర్ ను దళిత జాతికే పరిమితం చేయాలని కాంగ్రెస్ కుట్ర చేసిందన్నారు.

నిజానికి భరత జాతికి అంబేద్కర్ దేవుడని అభివర్ణించారు. ఆ మహనీయుడి చరిత్రను నేటి తరానికి తెలియజేసేందుకే సామాజిక సమరసత దినోత్సవాల పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని శుభమంగళ గార్డెన్స్ లో నిర్వహించిన ‘సెమినార్’ లో బండి సంజయ్ ప్రసంగించారు.

మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు,  మానేరు అనంతరెడ్డి, దేవేందర్ రావు, అడవి కుమార్, డాక్టర్ గంగాధర్, రాజేందర్ రెడ్డి, సోమిడి వేణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఆర్ధిక శాస్త్రంలో పీహెచ్ డీ  చేసిన తొలి భారతీయుడు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.

దేశానికి అద్బుతమైన రాజ్యాంగాన్ని అందించి యావత్ ప్రపంచమే గర్వించదగ్గ అత్యున్నత ప్రజాస్వామ్యానికి బాటలు వేసిన గొప్ప మేధావి అన్నారు. ఇయాళ మనం ఇక్కడ ఇంత స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నామంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చలువే. దళిత, బడుగు, బలహీనవర్గాల బిడ్డలంతా రిజర్వేషన్ల ఫలాలు అనుభవిస్తు న్నారంటే ఆయనే కారణం.

రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పదవులుసహా  ఉన్నత పదవుల్లో దళిత, బహుజన బిడ్డలు కొనసాగుతున్నారంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్షే. ఆయన లేకుంటే మనం ఏమై పోతుంటిమో, ఎంతటి దుర్బర జీవితాలను అనుభవిస్తుంటిమో తలుచుకుంటేనే భయమేస్తోందన్నారు.   కాంగ్రెస్ పార్టీ జీవితాంతం అనేక అవమానాలకు గురిచేసిందని బ్రిటీష్ పాలనను మించి అవమానించిందని అంబేద్కర్ ను చరిత్రను తెరమరుగు చేసేందుకే అడుగడుగునా యత్నించిందన్నారు.

అంబేద్కర్ కు భారతరత్న అవార్డు వచ్చేలా చేసిన పార్టీ బీజేపీ. అంబేద్కర్ జయంతి రోజు  రాష్ట్రీయ సమరసత దినంగా ప్రకటించి 120 దేశాల్లో జ యంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. పంచతీర్థాలను అభివృద్ధి చేసినం.

పార్లమెంటులో అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసినం. సుప్రీంకోర్టు, న్యాయమంత్రిత్వ శాఖలో విగ్రహం ఏర్పాటు చేసినం. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిం చినం. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నారీ శక్తి వందన్ బిల్లును ప్రవేశపెట్టిన మన్నారు    ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న ఏకైక పార్టీ కూడా బీజేపీయే.అన్నారు.