మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): ఉమ్మడి పాలమూ రు జిల్లాలో బుధవారం మంత్రుల పర్యటనపై మాజీ మంత్రి సింగి రెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రకటనలో ఫైర్ అయ్యారు. పాలమూరును ఎండబె ట్టి, కాళేశ్వరంను పండబెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని విమర్శిం చారు. ఉమ్మడి రాష్ట్రంలో పాల మూరు ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టి ఆంధ్రా, రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు.
కెసీఆర్ తలపె ట్టిన పాలమూరు ఎత్తి పోతల పనులపై కేసులు వేయించి అడ్డుకున్న పాపం కాం గ్రెస్‌ద న్నారు. వట్టెం పంపుహౌస్ మునిగి నెల కావస్తున్నా కనీసం నీళ్లు తోడకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఉద్ద ండాపూర్ నుంచి గ్రావిటి ద్వారా కొడంగల్, నారాయణపేటకు సాగునీరును తరలించే అ వకాశం ఉన్న సీఎం రేవంత్ బేషజాలకు పోయి కొత్త ఎత్తిపోతల పథకాన్ని మొదలు పెట్టారని ఆరోపించారు.