calender_icon.png 22 February, 2025 | 3:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానంపై కాంగ్రెస్ గురి

22-02-2025 01:31:11 AM

  1. పోలింగ్‌కు ఇంకా ఐదురోజుల సమయం
  2. పట్టభద్రులకు చేరువయ్యేందుకు ప్రణాళికలు
  3. ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జ్ నియామకం

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నది. ఈ సెగ్మెంట్ పరిధిలోని మొత్తం 42 అసెంబ్లీ స్థానాలకు చెందిన పట్టభద్రులు ఈనెల 27న తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ప్రస్తుతం ఈ స్థానంలో కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కానీ.. ఆయన బరిలో నిలిచేందుకు సుముఖత చూపకపోవడంతో ఆల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి సీటును దక్కించుకున్నారు. సిట్టింగ్ సీటును దక్కించుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు ముందుకు వెళ్తున్నాయి.

ఏది ఏమైనా సరే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. ప్రచారానికి ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉండడంతో మరింత జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అధిష్ఠానం ఇప్పటికే ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జ్‌ని నియమించింది. ఇన్‌చార్జులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పట్టభద్రుల ఓటు అభ్యర్థిస్తున్నారు.

ఓటింగ్ రోజున వారు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో పాటు  కార్పొరేషన్ చైర్మన్లు యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్, మహిళా విభాగ నేతలు సైతం ప్రచారంలో భాగస్వాములవుతున్నారు.

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తన సొంత జిల్లా నిజామాబాద్‌లో రెండు రోజులుగా పర్యటిస్తూనే నాలుగు ఉమ్మడి జిల్లాల నేతలు, పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నారు. 

ఫస్ట్, సెకండ్ ప్రాధాన్యత ఓట్లపై దృష్టి పెట్టండి: సీఎం

కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గు రువారం రాత్రి కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన ఎత్తుగడలపై పార్టీ శ్రేణులకు సూచనలు, సలహాలిచ్చారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న సంక్షేమ పథ కాలు, అభివృద్ధి పనులను పట్టభద్రులకు వివరించాలని, తద్వారా మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లు రాబట్టేందుకు కృషి చే యాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు వ్యూహాత్మకంగా వ్యవ హరించాలని సూచించారు. ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని హెచ్చరించారు.

మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. ఎమ్మె ల్సీ ఎన్నిక కీలకమైందని, పార్టీ శ్రేణులు ఎ న్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని పి లుపునిచ్చారు. పార్టీ శ్రేణుల అవసరార్థం గాంధీభవన్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. మీటింగ్‌లో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభా కర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండాసురేఖతో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.