మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొన్నం ప్రభాకర్
సూర్యాపేట, డిసెంబర్ 6 (విజయక్రాంతి): రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వమాకే దక్కిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మం త్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో వారు పర్యటింఇచి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ.. వరి ధాన్యం పండించడంలో నల్లగొండ జిల్లా ఇతర రాష్ట్రాలతో పోటీపడుతుందన్నారు. హుజూర్‌నగర్‌లో అత్యాధునిక సదుపాయాలతో బస్టాండ్ నిర్మాణం చేపడుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
అదనపు ఫ్లాట్‌ఫామ్, షాపింగ్ కాంప్లెక్స్, బస్టాండ్ ముందు పెట్రోల్‌బంక్ నిర్మాణాలను చేపడుతామన్నారు. కొత్త బస్టాండ్‌కు రోజుకు 170 బస్సులు వస్తున్నాయన్నారు. మరిన్ని బస్సులు పెంచేలా కృషి చేస్తామన్నారు.. రాబోయే 50 ఏండ్ల వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధునాతన పద్ధతుల్లో బస్టాండ్ నిర్మాణం చేపడుతామ కన్నారు.
అనంతరం పాతబస్టాండ్‌ను పరిశీలించి సమీపంలోని ఓ టీ స్టాల్‌లో మంత్రులు చాయ్ తాగుతూ ప్రజలతో ముచ్చటించారు. కాగా హుజూర్‌నగర్‌లో ఆర్‌అండ్‌బి సబ్ డివిజన్ కార్యాలయానికి, గెస్ట్ హౌస్‌కు, గోవిందాపురం బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారిని అభివృద్ధి చేస్తామని, డిగ్రీ కళాశాల భవనం నిర్మిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
ఇరిగేషన్ లిప్టును మరమ్మతులు చేయించి పూర్తి సామర్థ్యంలో పనిచేసేలా చేసి ఆయకట్టును పెంచుతామన్నారు. పట్టణంలోని అన్ని రహదారులను డబుల్ రహదారులుగా చేపడుతున్నామన్నారు. కోదాడ నియోజకవర్గం చిలుకూ ర్‌లో సమీకృత పాఠశాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్‌పద్మావతిరెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్, మున్సిపల్ చైర్‌పర్సన్ గెల్లి అర్చనరవి, వైస్ చైర్మన్ కోతి సంపత్‌రెడ్డి పాల్గొన్నారు.