calender_icon.png 20 March, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసి మహిళలకు కాంగ్రెస్ అండ

14-03-2025 12:00:00 AM

పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ 

మహబూబాబాద్.మార్చి 13 (విజయ క్రాంతి): ఆదివాసీ మహిళలకు కాంగ్రెస్ పార్టీ  అండగా ఉంటుందని తెలంగాణ పిసి సి అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ అన్నా రు. బుధవారం హైదరాబాద్ గాంధీ భవన్ లో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ జిల్లా కార్యవర్గ స్టీరింగ్ కమిటీ సమావేశం అయ్యా రు. ఈ సమావేశానికి ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ తేజవత్ బెల్లయ్య నాయక్ అధ్యక్షత వహించారు.

కాగా నూతన ఆదివాసి తెలంగాణ జిల్లా వైస్ చైర్ పర్సన్ పద్మ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది. ఈ సంద ర్భంగా సభను ఉద్దేశించి టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఆదివాసి మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుం దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంతో పనిచేస్తుందని అన్నారు.

మహిళలకు భరోసాను కల్పిస్తూ ఆదివాసి గుడాలలో ఆదివాసి తం డాలలో గ్రామంలో ప్రభుత్వ పథకాలు ఉచి త కరెంట్ 200 యూనిట్లు ఆర్టిసి బస్సులో మహిళలకు ఫ్రీగా ప్రయాణం ఇందిరమ్మ ఇల్లు మహిళా నిరుద్యోగులకు 3 లక్షల రూ పాయల ఆర్థిక సహాయం ఇంకా అనేక పథకాలను మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా చేపడుతుందని చెప్పారు.

కాగా ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీల పట్ల ఒక విజన్ కలిగి ఉందని తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆదివాసి కాంగ్రెస్ జిల్లా వైస్ చైర్మన్ భూక్య పద్మ ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ గుగులోత్ వెంకట్ నాయక్ జి ల్లా చైర్మన్ బోడ రవి నాయక్ పాల్గొన్నారు.