calender_icon.png 20 October, 2024 | 5:30 AM

గోధ్వజ్ యాత్రకు కాంగ్రెస్ మద్దతు

18-10-2024 02:07:56 AM

  1. ఆవును రాజ్యమాతగా ప్రకటించేందుకు అనుకూలమని స్పష్టం
  2. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెడుతామని హామీ
  3. గుజరాత్‌లో శంకరాచార్య స్వామీజీ పర్యటన సందర్భంగా ప్రకటన

అహ్మదాబాద్, అక్టోబర్ 17: గోధ్వజ్ స్థాపన భారత్ యాత్రలో భాగంగా గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో గోప్రతిష్ఠ జెండాను జ్మోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీజీ గురువారం స్థాపించారు. ముంబైలో గోధ్వ జ స్థాపన తర్వాత  అహ్మదాబాద్ చేరుకున్న స్వామీజీ.. భక్తులతో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

భక్తు ల నుంచి పాదుక పూజ స్వీకరించారు. అనంతరం గాంధీనగర్ చేరుకున్న స్వామీజీ.. సోలా భగవత్ విద్యాపీఠ్‌లో భక్తులతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి చాలా మంది కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. తర్వాత గోధ్వజ స్థాపన చేశారు.

గోమాతను రాజ్యమాతగా ప్రకటించాలనే లక్ష్యంతో శంకరాచార్య స్వా మీజీ భారత్ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానుల్లో గోప్రతిష్ఠ జెండాను స్థాపించేందుకు సెప్టెంబర్ 22న యాత్ర చేపట్టారు. ఈ యాత్ర అక్టోబర్ 26 పూర్తి కానుంది. కాగా యాత్రలో భాగంగా స్వామీజీ గురువారం రాత్రి రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు భక్తులు ఘన స్వాగతం పలికారు.  

కాంగ్రెస్, వీహెచ్‌పీ అనుకూలం

గుజరాత్‌లో శంకరాచార్య స్వామీజీ పర్యటన సందర్భంగా కాంగ్రెస్‌తోపాటు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కీలక ప్రకటన చేశాయి. గోమాతను రాజ్యమాతగా ప్రకటించేందుకు తాము అనుకూలంగా ఉన్నామని స్పష్టంచేశారు. గాంధీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తమ మద్దతు ప్రకటించారు.

గుజరాత్ కాంగ్రెస్ పక్ష నేత అమిత్ చవ్‌డా ఈ మేరకు ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీ తరఫున తీర్మానం ప్రవేశపెడతామని పేర్కొ న్నారు.  వీహెచ్‌పీ కూడా యాత్రకు మద్దతు తెలిపింది. వీహెచ్‌పీ రాష్ట్ర చీఫ్ అశోక్ రావల్ మాట్లాడుతూ.. గోమాతను రాజ్యమాతగా ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.