calender_icon.png 26 November, 2024 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అంటే ‘గ్లోబల్ గోల్‌మాల్ పార్టీ’

09-10-2024 01:43:13 AM

ఇప్పటికీ సగం మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు

ఆసరా పింఛన్లు రాక అవ్వతాతలు ఇబ్బందిపడుతున్నారు

మాజీ మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ఇందిరమ్మ రాజ్యంలో అవ్వతాతలకు సకాలంలో ఆసరా పెన్షన్లు, ఉద్యోగులకు సకా లంలో జీతాలు అందడం లేదని మాజీ మం త్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు.

మంగళవారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దసరా దెగ్గర పడుతునా తెలంగా ణలో ఇప్పటివరకు కాంట్రాక్టు, ఔట్ సోర్సిం గ్ ఉద్యోగులు, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రు ల ఉద్యోగ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవ డం దారుణమన్నారు. 

అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.. అయితే కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్స్ ఇచ్చి పరీక్షలు నిర్వహించిన వారికి అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చి ఉద్యోగాలిచ్చామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అంటే గోల్డెన్ గ్యారంటీ పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని.. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అంటే గ్లోబల్ గోల్‌మాల్ పార్టీగా మారిందని విమర్శించారు.

ప్రభుత్వ ఆస్పత్రులల్లో సరిగా వైద్యం అందడం లేదన్నారు. మాజీ సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు గౌరవ వేతనాలు ఇవ్వలేదని, వాళ్లకు రావాల్సిన బిల్లులు ఇవ్వడం లేదని విమర్శించారు. రూ.5లక్షలు, రూ. 10లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టర్లకు బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

వెంటనే ఆరు గ్యారంటీలను అమలుచేయాలన్నారు. ఈ సమావే శంలో బీఆర్‌ఎస్ నాయకులు రాజనర్సు, ఎర్ర యాదయ్య, శ్రీకాంత్ రెడ్డి, సోమిరెడ్డి, బాలకృష్ణ రెడ్డి, భూపేశ్, చందర్ రావు, రాజు తదితరులు పాల్గొన్నారు.