calender_icon.png 25 April, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పౌల్ట్రీ పరిశ్రమకు అండగా కాంగ్రెస్

25-04-2025 12:15:13 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

ముషీరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): పౌల్ట్రీ పరిశ్రమను తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు అన్ని విధాలుగా సహకారం అందిస్తూ ఆదుకుంటుందని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు కాసర్ల మోహన్ రెడ్డి లు అన్నారు. బర్డ్ ఫ్లూ, గుడ్ల ధరలు, కోళ్ల దాణాకు సంబంధించిన అన్ని విషయాల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మద్దతుగా నిలిచిందని వారు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్‌లో తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్, నేషనల్ ఎగ్ కో -ఆర్డినేషన్ కమిటీ, ఇండియన్ పౌల్ట్రీ ఎక్యూప్ మెంట్ మ్యానిఫాక్చర్ అసోసియేషన్ పౌల్ట్రీ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ పథకం కింద గుడ్ల సరఫరా కేవలం కొంత మంది మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లింది అని తెలిసి ఈ విషయం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ సంప్రదించగా వెంటనే స్పందించి మధ్యవర్తుల చేతికి వెళ్లకుండా వాయిదా వేయాలని తగిన చర్య లు తీసుకావాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. ఈ విషయం పై త్వరలోనే సమీక్ష నిర్వహించాలని అంగన్వాడీ గుడ్ల సరఫరా భవిష్యత్‌లో తెలంగాణ పౌల్ట్రీ ఫెడరే షన్ ద్వారా పౌల్ట్రీ చిన్న, సన్నకారు రైతుల ద్వారా సరఫరా జరగాలని కోరారు. ద్వారా పౌల్ట్రీ రైతులకు ఎంతో మేలు కలుగుతుందని, ఇంతటి ప్రతిష్టాత్మక నిర్ణయం తీసు కున్న ముఖ్యమంత్రికి క్షీరాబిషేకం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో పౌల్ట్రీ ఇండియా ఫౌండర్ అనిల్ ధుమాల్, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెం ట్, నరసింహారెడ్డి, జనరల్ సెక్రటరీ భాస్కర్ రావు, పౌల్ట్రీ ఇండియా డైరెక్టర్ పొట్లూరి చక్రధర్ రావు, పౌల్ట్రీ రైతులు తదితరులు పాల్గొన్నారు.