27-04-2025 12:00:00 AM
కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు కావలి బుగ్గ రాములు ముదిరాజ్
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 26: పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు కావాలి బుగ్గ రాములు ముదిరాజ్, మాజీ ఎంపీటీసీ కావాలి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల్ మండలం ఆరుట్ల గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కృషితో ఆరుట్ల గ్రామ శాఖ అధ్యక్షుడు రావుల బాష, కార్యదర్శి దాసరమోని రమేష్ ముదిరాజ్ ల ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి కావలి బుగ్గ రాములు ముదిరాజ్, కావలి శ్రీనివాస్ లు ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారికి అండగా సీఎం సహాయనిధి నిలుస్తుందని తెలిపారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని దశల వారి గా ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.
సీఎం సహాయనిధి చెక్కులు అందుకున్న వారిలో నూకం హేమంత్ ముదిరాజ్‌కు రూ.25000/- రూపాయలు, పిడుగు జ్యోతికి రూ.1,00,000/- రూపాయలు, కొత్తపల్లి శంకరయ్య గౌడ్ కు రూ.60000/- రూపాయల చెక్కులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పంపిణీ చేశారు.
ఈ కార్యక్ర మంలో ఆరుట్ల గ్రామ ఎస్సి సెల్ అధ్యక్షుడు ఇందిరమ్మ కమిటీ సభ్యుడు కంబాలపల్లి బుగ్గ రాములు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు బుట్టి కృష్ణ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంబాల బుగ్గ రాములు, మాధగోని జంగయ్య గౌడ్, కావలి రమేష్ ముదిరాజ్,
బుట్టి జంగయ్య, మంచాల మండలం యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల రాఘవ, ఆరుట్ల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరమోని అశోక్ ముదిరాజ్, నాయకులు గుడ్డిమల్ల చంద్రయ్య, వెదిరె రమణరెడ్డి, మార సురేష్, తవిటి.యాదయ్య, మంకు ప్రవీణ్, యండి అష్సు, బుస్సు వంశి తదితరులు పాల్గొన్నారు.