15-04-2025 01:34:50 AM
సీఎంఆర్‌ఎఫ్ చెక్కును అందజేసిన జిల్లెల ప్రవీణ్ కుమార్ రెడ్డి
గోపాలపేట ఏప్రిల్ 14: ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది అని మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ జిల్లెల ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం గోపాలపేట మండలం జయన్న తిరుమలాపురం గ్రామం లో అనారోగ్యానికి గురైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు.
గ్రామానికి చెందిన. అనారోగ్యానికి గురైన వారు మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ చేసు కున్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల డాక్టర్ చిన్నారెడ్డి. కృషి పట్ల. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు అయినది లక్ష్మయ్యకు 35 వేలు నవీన్ కు 9 వేల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.