calender_icon.png 4 December, 2024 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి

03-12-2024 10:57:59 PM

టీపీసీసీ జనరల్ సెక్రెటరీ పున్నారెడ్డి... 

కామారెడ్డి (విజయక్రాంతి): త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచి నుండి జెడ్పిటిసి వరకు జెండా ఎగురవేయాలని టిపిసిసి జనరల్ సెక్రెటరీ పున్నారెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలం కేంద్రంలో రైతు ఉత్సవాల్లో భాగంగా నాలుగో విడత రుణమాఫీ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చిత్రపటాలకు మండల రైతులు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావుతో పాటు టిపిసిసి జనరల్ సెక్రెటరీ పున్నారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పున్నారెడ్డి మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త కష్టపడి కాదు ఇష్టపడి పని చేయాలన్నారు. ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ పార్టీ చిత్త శుద్ధితో అమలు చేస్తుందన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తోనే సాధ్యమన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇచ్చినటువంటి హామీలను 150 కోట్లతో అభివృద్ధి చేస్తామన్న మాట ప్రజలను మోసం చేశారన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మౌసీలాల్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గోనే శ్రీనివాస్, మండల ఎస్టీ సెల్ శంకర్ నాయక్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజిరెడ్డి, రామచంద్రం, మైనార్టీ సెల్ అస్లాం, మాచారెడ్డి గ్రామ అధ్యక్షులు ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షులు బద్రి కొమురయ్య, సుబ్బు, భాస్కర్ గౌడ్, అలీ ఖాన్, బన్సీలాల్, రవి నాయక్, రాజనర్సింలు, మండల రైతులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.