calender_icon.png 21 September, 2024 | 1:57 AM

కాంగ్రెస్ ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలి

21-09-2024 12:11:36 AM

తెలంగాణ బీసీ ఫ్రంట్ చైర్మన్ మల్లేశ్ యాదవ్

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 20: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా ఇంతవరకు కులగణన చేయడం లేదని, ఎన్నికల వాగ్ధానం ప్రకారం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని తెలంగాణ బీసీ ఫ్రంట్ చైర్మన్ జీ మల్లేశ్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ బీసీ ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి రంగారెడ్డి కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా మల్లేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.

రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో విద్యార్థులకు గత మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజులు, మెస్ ఛార్జీలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీజులు బకాయి ఉండడంతో ఇంజినీరింగ్ పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందిచకుండా కాలేజీల యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు. వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.