calender_icon.png 29 April, 2025 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి

28-04-2025 12:17:52 AM

  1. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
  2. రాహుల్ ఆరోపణలై మండిపాటు

హైదరాబాద్, ఏప్రిల్27 (విజయక్రాంతి): కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విపక్షాల గొంతు నొ క్కేస్తున్నదని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ భారత్ సమ్మిట్‌లో చేసిన ఆరోపణలను ఖండిస్తూ బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జి ఎన్వీ సుభాష్ మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువల పట్ల రాహుల్‌గాంధీకి అవగాహ నలేమిని ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయని, దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన ఆ దివారం ప్రకటనలో విమర్శించారు.

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిపై రాబర్ట్ వాద్రా చేసిన అనుచి త వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుబట్టారు. దేశం విషాదంలో మునిగి పోయిన సందర్భంలో వీధి ప్రార్థనల నిషేధాలపై వాద్రా చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.

26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన తరుణంలో, బాధితులకు అండగా నిలబడాల్సింది పోయి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడం సిగ్గుచేటని అన్నారు. దేశ ఐక్యత, భద్రతకు సవాల్ విసిరే శక్తులపై గట్టి చర్యలు తీసుకుంటూనే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఎన్వీ సుభాష్ స్పష్టం చేశారు.