13-02-2025 05:14:34 PM
ఫిబ్రవరి 20న చలో హైదరాబాద్ ను విజయవంతం చేయండి..
సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ..
లక్షెట్టిపేట (విజయక్రాంతి): ప్రజలకు ఇచ్చిన హామీలను, వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని 6 గ్యారంటీలతో పాటు, ఏడవ హామీ ప్రజాస్వామిక హక్కులను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గురువారం స్థానిక ఐబి ఆవరణలో పోస్టర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి లాల్ కుమార్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలల్లో ఆరు గ్యారంటీలతో పాటు మొత్తం 420 హామీలను ఇచ్చింది అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న ఇందులో ఒకటి అర వాగ్దానాలు తప్ప అత్యధికం అలాగే ఉన్నాయి. రైతులకు చేస్తానన్న రుణమాఫీ ఇంకా సగానికి సగం అమలు కాలేదు, రైతుబంధు ఎకరాకు 15000 ఇస్తానని 12000 మాత్రమే ప్రకటించారు.
ఆడిన మాట తప్పిండ్రు రైతు భరోసా ఇప్పటికే ఒక పంట ఎగ్గొట్టారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల స్థానంలో ఉచితంగా ఇస్తానని చెప్పిన ఇందిరమ్మ ఇళ్ల పథకం సంవత్సరం దాటిన ఆచరణ రూపంలో రాలేదు, పొడు భూములకు పట్టాలిస్తానని, ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వాగ్దానాలను అమలు చేయలేదు. చేయూత పథకం ఇంకా ప్రారంభమే కాలేదు. ధరణి దోషులపై చర్యలు లేవు, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి లేదు. విద్యా, వైద్య రంగాలలో ఏం మార్పు రాలేదు ప్రజాపాలన అసలే లేదు, బుట్టకపు ఎన్కౌంటర్లు యధావిధిగా కొనసాగుతున్నాయి. పౌర ప్రజాస్వామ్య హక్కులు కాలరాయపడుతున్నాయి.
ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20వ తారీఖున హైదరాబాదులో ప్రజా ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించతలపెట్టింది. కావున అన్ని వర్గాల ప్రజలు, ప్రజాసామికవాదులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు రెడ్డి మల్ల ప్రకాష్, అరుణోదయ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లన్న, ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దొండ ప్రభాకర్, పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి అరుణ, ఐఎఫ్టుయు జిల్లా నాయకులు సురెందర్, రాజేశం, సయ్యద్, అరుణోదయ జిల్లా ఉపాధ్యక్షులు కుస్నేపల్లి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.