calender_icon.png 13 March, 2025 | 2:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

17-05-2024 12:59:09 AM

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ, మే 16 (విజయక్రాంతి): ఉమ్మ డి వరంగల్, నల్లగొండ, ఖమ్మం నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలో బీఆర్ ఎస్‌ను గెలిపించి, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం జనగామ మం డలం పసరమడ్లలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో బీఆర్‌ఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని చెప్పి ఇప్పుడు నిరుద్యోగులను మోసం చేసిందని అన్నారు. ప్రశ్నించే గొంతుక అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతుకను అని చెప్పుకుంటున్న తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్‌ను ప్రశ్నించే దమ్ముందా అని అన్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగుల సమస్యలపై గళమెత్తుతానని చెప్పారు. సమావేశంలో జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ పోకల జమున, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్దె సిద్ధిలింగం, గద్దల నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.