calender_icon.png 19 April, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌ను సంస్థాగతంగా పటిష్టవంతం చేయాలి

19-04-2025 12:31:25 AM

దిశా, దశ నిర్దేశించిన ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్

కామారెడ్డి, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి ), కాంగ్రెస్ పార్టీని సంస్థగతంగా పటి ష్టవంతం చేయాలని ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. శుక్రవారం హైదరాబాదులోని  గాంధీభవన్‌లో  జహీరాబాద్ పార్లమెంటు స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్  కాంగ్రెస్ పార్టీని సంస్థగతంగా  పటిష్టం చేయడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి దిశా దశ నిర్దేశించడం చేశారు. 

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్, నినాదాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ ప్రజల లోకి తీసుకువెళ్లాలని ఏఐసిసి  ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించారు. ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి  రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి అందరు   పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలతో  చర్చించాలని అప్పుడే ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుందని అన్నారు.

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు,రెండు లక్షల రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే భూభారతి సర్వేకార్యక్రమాలు నిర్వహించడం తదితర అంశాలపై ముఖ్యంగా మహిళలకు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వివరించాలని తెలిపారు.