13-02-2025 12:00:00 AM
దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్
దేవరకొండ, ఫిబ్రవరి 12 : కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషిచేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. దేవరకొండ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేశారు.
ఈ సందర్భంగా వారికి ఆయన కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు పేదల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీలో చేరిన వారికి ఆయన సూచించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల్ల వెంకటయ్య గౌడ్, మాజీ సర్పంచులు సివర్ల మధుయాదవ్, కోటియాదవ్ తదితరులు పాల్గొన్నారు.