calender_icon.png 17 April, 2025 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్‌కు కాంగ్రెస్ అవమానం

14-04-2025 12:59:16 AM

ఆనాడు అంబేద్కర్‌ను అవమానించి..నేడు పాదయాత్రలా?

బీజేపీఎంపీ, ఎమ్మెల్యేల వెల్లడి

ఆదిలాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి) : ఆనాడు అంబేద్కర్ ను రాజకీయంగా ఎదగకుండా మరో వ్యక్తిని పోటీలో నిలబెట్టి అంబేద్కర్ ను ఓడించిన ఘనత కాంగ్రెస్ దని ఎంపీ గోడం నగేష్ అన్నారు. అదే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటా న్ని చేత పట్టుకుని ఊరురా పాదయాత్రలు చేపట్టడం సిగ్గుచేటని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుల తీరు నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి  పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు.

ఈ మేరకు ఎంపీ, ఎమ్మెల్యే లు మాట్లాడుతూ.. అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరు ను నిరసిస్తూ నేటి నుంచి 25వ తేదీ వరకు ఈ వారం రోజులు అనేకమైన కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే ఆ మహనీయుని విగ్రహం శుద్ధి కార్యక్రమం,  రేపు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్‌ని వ్యతిరే కించడం జరిగిందన్నారు.

ఈ ఘటనలను దేశ ప్రజానీకం ఎన్నడూ మరిచిపోదన్నారు. ఇంత గొప్ప రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం భారతరత్న ఇవ్వలేదని, ఆయన సేవలు గుర్తించి బీజేపీ ప్రభుత్వం భారతరత్న ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, పార్టీ నాయకులు, పలువురు దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.