calender_icon.png 1 January, 2025 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు శాపంగా కాంగ్రెస్ పాలన

30-12-2024 02:02:25 AM

  1. ఉమ్మడి ఆదిలాబాద్‌లో దీనావస్థలో గురుకులాలు
  2. మాజీమంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, డిసెంబర్ 29(విజయక్రాంతి): కాంగ్రెస్ చేతగాని పాలన గురుకుల విద్యార్థులకు శాపంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో చదువు సంగతి దేవుడెరుగు, పిల్లలు బతికుంటేచాలని తల్లిదండ్రులు అనుకునే పరిస్థితికి తీసుకొచ్చారని ఆదివారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురుకులాల దీనస్థితి చూస్తే బాసర సరస్వతి మనసు తల్లడిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు గురుకులాల్లో సీట్ల కోసం క్యూ కట్టిన వారే, ఇప్పుడు అదే గురుకులాల నుంచి ఇంటిబాట పడుతున్నారన్నారు.

రేవంత్‌రెడ్డి ఏడాది పాలనా వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనమేముంటుందని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రిగా విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి, విద్యార్థుల ప్రాణాలను రక్షించాలని డిమాండ్ చేశారు.