- సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో పీసీసీ నేతల భేటీ
- నామినేటెడ్ పోస్టులు, పార్టీ బలోపేతంపై చర్చ
హైదరాబాద్, నవంబర్ 20(విజయక్రాం తి): ప్రజాపాలన విజయోత్సవాల నిర్వహణ సహా పలు అంశాలపై తెలంగాణ పీసీసీ సమీ క్ష నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో బుధవారం రాత్రి జరిగిన ఈ భేటీలో నామినేటెడ్ పదవుల భర్తీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజాపాలన విజయోత్సవాల్లో పార్టీ మైలేజీ పెంచడం వంటి అంశాలపై నేతలు చర్చించారు.
నామినేటెడ్ పదవులకు సంబంధించి ఇప్పటికే 35 స్థానాలను భర్తీ చేయగా మరికొన్ని పదవులకు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను త్యాగం చేసిన ముఖ్యనేతలు సహా ఇతర నేతలు పోటీలో ఉన్నారు. కాగా, ఈ సమావేశంలో సీఎం రేవంత్ సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపదాస్ మున్షీ హాజరయ్యారు.