18-04-2025 01:09:29 AM
బీజేపీ జిల్లా ఉపాద్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు
తిమ్మాపూర్, ఏప్రిల్17 (విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల ను మరిచిపోయిందని, నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న మాటలను, 420 హామీలను అటకెక్కిచ్చిందని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు అన్నారు.
బిజెపి మండలాధ్యక్షులు సుగుర్తి జగదీశ్వర చారి ఆధ్వర్యంలో గురువారం రోజున తిమ్మాపూర్ మండలం మక్త పల్లి లో సంఘటన సంరచన అభియాన్ (సంస్థాగత నిర్మాణం) ప్రోగ్రాం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూమండలంలో పార్టీ ని మరింత బలోపేతం చేయాలనీ, ఆ దిశగా పోలింగ్ బూత్ మొదలుకొని మండల కమిటీ వరకు పూర్తిస్థాయిలో పార్టీ నిర్మాణం జరగాలన్నారు.
బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు చింతం శ్రీనివాస్ , బూట్ల శ్రీనివాస్ , మండల ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి , బీజేవైఎం మండలాధ్యక్షులు గడ్డం అరుణ్, మండల నాయకులు కార్యకర్తలు, పోలింగ్ బూత్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.