calender_icon.png 4 January, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సమరానికి కాంగ్రెస్ రెఢీ

01-01-2025 01:38:02 AM

  1. హామీల అమలుకు అడుగులు వేస్తున్న ప్రభుత్వం
  2. కొత్త ఏడాదిలో మరిన్ని హామీల అమలు!
  3. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసాతో మరింత సానుకూలత!

హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి ) : స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందుకు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం  ముందుకు సాగుతోం ది.

అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అభయహస్తం పథకం ప్రకటించి.. ఆరు గ్యారెంటీల్లో కొన్నింటిని అమలుచేసిన సర్కార్, మిగతా వాటిని కూడా జనవరిలో అమలు చేయనుంది. జనవరి చివ రి వారం లేదంటే ఫిబ్రవరిలో పంచాయ తీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి సత్తా చాటా లనే ప్రయత్నంలో కాంగ్రెస్ నేతలున్నా రు.

2023 డిసెంబర్‌లో అధికారం చేపట్టామని.. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను జీరోకు తీసుకెళ్లామని, ఇక స్థానిక ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌కు ఖాతాలేకుండా చేస్తామని కాంగ్రెస్ నేతలు అంటు న్నారు. బీజేపీకి గ్రామాల్లో పెద్దగా పట్టులేదన్న ఆలోచనతో హస్తం పార్టీ నేతలున్నారు.

ఈ నెలలోనే ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసాతో పాటు భూ సమస్యల పరిష్కారం కో సం తీసుకొచ్చిన భూ భారతి చట్టం 2024 ను  విస్తృత ప్రచారం చేసుకోవాలనే ఆలోచనతో అధికార కాంగ్రెస్ నేతలున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో మొత్తం 4.50 లక్షల ఇళ్లను ఈ ఏడా దిలో పూర్తి చేయాలనే లక్ష్యంతో సర్కార్ ముందుకెళ్లనుంది.

ఇక రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడంతో రైతుల్లోనూ ఆనం దం వెళ్లివిరుస్తుందని, తద్వారా పంచాయతీ ఎన్నికల్లో పాగా వేయవచ్చనే అభిప్రాయం తో ఉన్నారు. అంతేకాకుండా  కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం పరిధిని రూ. 5 లక్షల నుం చి రూ. 10 లక్షలకు పెంచింది.

ఆ తర్వాత రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీకి ప్రభు త్వం రూ. 22 వేల కోట్ల వరకు ఖర్చు చేసిందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో భర్తీచేయని ఉద్యోగాలను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 55 వేల వరకు భర్తీచేసిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు ప్రజలకు వివరించనున్నారు. వీటితో పాటు మిగతా సం క్షేమ పథకాల అమలును కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నారు.