జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్
ఖమ్మం (విజయక్రాంతి): త్వరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు సర్వం సిద్దం కావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ మండల, పట్టణ బాక్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో ప్రత్యేకించి, సమావేశమై, రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీ విజయానికి చేయాల్సిన కృషి గురించి చైతన్యపర్చారు. ఈ సందర్బంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. స్ధానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల విజయానికి బూత్ స్ధాయి నుంచి తీవ్రంగా కృషి చేయాలన్నారు. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు జరిగే ప్రజాపాలన విజయోత్సవాల్లో అంతా భాగస్వాములు కావాలని అన్నారు. రైతు విజయోత్సవ పండుగను కూడా విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మొక్కా శేఖర్ గౌడ్, దొబ్బల సౌజన్య, పుచ్చకాయల వీరభద్రం, బొడ్డు బొందయ్య, సయ్యద్ ముజాహీద్ హుస్సేన్, సయ్యద్ గౌస్, వేముల కృష్ణప్రసాద్, దగ్గుల రఘుపతిరెడ్డి, యర్రం బాలగంగాధర్ తిలక్, బోజెడ్ల సతీష్, కళ్లెం వెంకటరెడ్డి, భూక్యా బాలాజీ నాయక్, సూరంశెట్టి కిషోర్, గాలి దుర్గారావు, వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.