calender_icon.png 1 March, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాది ప్రజా శ్రేయస్సుకోరే ప్రజా ప్రభుత్వం..

28-01-2025 06:54:36 PM

కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రజాపాలనలో 4 సంక్షేమ పధకాలను ప్రజలకు అందజేస్తున్న సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మావలలో పెద్ద ఎత్తున రైతులు, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. ముందుగా రైతులతో కలిసి భారీ ట్రాక్టర్ లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతోందన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12 వేలు ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా బీఆర్ఎస్ సర్కార్ కాలయాపన చేసింది.