calender_icon.png 16 March, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీ స్పీకర్ పై జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై కల్లూరులో కాంగ్రెస్ నిరసన

16-03-2025 04:51:51 PM

కల్లూరు మార్కెట్ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో జగదీశ్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం..

కల్లూరు (విజయక్రాంతి): బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి కుల దురాహంకారంతో రాష్ర్ట అసెంబ్లీ స్పీకర్  ప్రసాద్ ను అవమానపరిచేలా వ్యవహరించడం దుర్మార్గమని స్పీకర్ ప్రసాద్ కు జగదీశ్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని కల్లూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన అంబెడ్కర్ సెంటర్ లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు నిరసిస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ నీరజ మాట్లాడుతూ... అసెంబ్లీ స్పీకర్ పదవికి ఒక ప్రత్యేకత విలువ ఉందని, స్పీకర్ చైర్ ను కాంగ్రెస్ దళితులకు కేటాయించింది దళితుడైన అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ ను కుల దుర అహంకారంతో అవమానించేలా బి.ఆర్.ఎస్ పార్టీ వ్యవహరించిందన్నారు.

కుల అహంకారంతో  దుర్మార్గంగా మాట్లాడుతున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజలకు స్పీకర్ కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలే రాష్ట్ర ప్రజలు బి.ఆర్.ఎస్ పార్టీ కి గుణపాఠం చెబుతారన్నారు. ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు,లక్కినేని కృష్ణ, భాగం ప్రభాకర్ చౌదరి, ఏనుగు సత్యం బాబు, ఆళ్లకుంట నరసింహరావు, దారా రంగా, పాపబత్తిని నగేష్, యాసా శ్రీకాంత్, శివకుమార్ నాయక్, మట్టా రామకృష్ణ, మూకర విజయరావు, వంశీ నాయక్, బొల్లం ఉపేంద్ర, కల్లూరు మండలం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.