calender_icon.png 3 February, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ నిరసన

03-02-2025 05:39:54 PM

ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండల కేంద్రం బోడు రోడ్ సెంటర్లో సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు వివక్షపై చూపిన కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 26000 కోట్ల పన్ను కేంద్రానికి చెల్లించినప్పటికి వారు కపట ప్రేమ చూపించటంపై మండల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్, పార్టీ మండల అధ్యక్షులు భూక్యా దేవానాయక్, నాయకులు ఇస్లావత్ రెడ్యా నాయక్, ఈది గణేష్, పోశాలు, చందర్ సింగ్, మంగిలాల్, బండ్ల రజినీ, బోడ సరిత, బండ్ల శ్రీను, ఉండేటీ ప్రసాద్, ఆఫ్రొజ్, లక్కినేని శ్యామ్, రాశమల్ల నర్సయ్య, లక్ష్మయ్య, మచ్చా సుధాకర్, సర్దార్, బానోత్ రవి, నాగేశ్వరావు, ఖానా, మాడే మధు తదితరులు పాల్గొన్నారు.