02-05-2024 02:01:43 AM
మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్
హైదరాబాద్, మే1 (విజయక్రాంతి): రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఈ నెల 4న ధర్నా చేయనున్నట్లు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఏ చంద్రశేఖర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో పార్టీ నేతలు ప్రీత మ్, గజ్జెల కాంతం, సతీష్ మాదిగతో కలిసి మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు. మొదటిసా రిగా రిజర్వేషన్లు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, ఇప్పుడు పెంచేది కూడా తమ పార్టీయేనని స్పష్టంచేశారు. కాంగ్రెస్ నేత గజ్జల కాంతం మాట్లాడుతూ.. బీజేపీ పార్టీకి, ఎస్సీ, ఎస్టీ, బీసీల మధ్య యుద్ధం జరుగు తోందని, రిజర్వేషన్లను కాపాడుకోవా ల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ మూల సిద్ధాంతమైన మనుధర్మ శాస్త్రం అమలు చేయడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని సతీష్ మాదిగ ఆరోపించారు.