హైదరాబాద్,(విజయక్రాంతి): పార్లమెంట్ లో రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మంగళవారం నిరసనలు చేశారు. కాంగ్రెస్ నేతలు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి కలెక్టరేట్ల వరకు బాబాసాహెబ్ సమ్మాన్ మార్చ్ చేపట్టారు. ఈ ర్యాలీని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. హైదరాబాద్ కలేక్టరేట్ వరకు చేపట్టిన నిరసన ర్యాలీలో వీ హనుమంత్ రావు, అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపి అనిల్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, జాతీయ నాయకుడు కొప్పుల రాజు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షలు రోహిన్ రెడ్డి, సమీరుల్లా తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ పై కాంగ్రెస్ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు.