మందమర్రి (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా పట్టణంలో కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని మార్కెట్ అంబేద్కర్ చౌకు వద్ద సోమవారం కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, నాయకులు సొత్కు సుదర్శన్, పుల్లూరు లక్ష్మణ్, పైడిమల్ల నర్సింగ్, మంద తిరుమలరెడ్డిలు మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని కేవలం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల మీదనే కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం అంటే ఎందుకు చిన్న చూపు అని వారు ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న తెలంగాణ రాష్ట్రంకు న్యాయం బడ్జెట్ కేటాయించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ అభివృద్ధి పథంలో నడవడాన్ని జీర్ణించుకోలేక బీజేపీ మోడీ ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వకుండా మొండి చేయి చూపించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నెరువట్ల శీను, ఎర్ర రాజు, ఆంజనేయులు, నర్సోజి, ప్రభాకర్, జమీల్, గణేష్, రంజిత్, శ్రీను, వేణు, రాంబాబు, ప్రదీప్, రవి, రాము, కృష్ణ, పాణి, యూత్ కాంగ్రెస్ నాయకులు రాయబారపు కిరణ్, బియ్యపు రవి కిరణ్, వడ్లకొండ సునీల్, రాజేష్, శేఖర్, ఉదయ్, సురేందర్, గణేష్, సూరజ్, రాజు పాల్గొన్నారు.