28-04-2024 12:04:44 AM
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
మురాదాబాద్ (యూపీ), ఏప్రిల్ 27: మైనారిటీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఉద్దేశించి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మైనారిటీలు తమకు ఇష్టమైన ఆహారం తినేందుకు అనుమతి ఇస్తామంటూ మ్యానిఫెస్టోలో పేర్కొందని, దానర్థం గోమాంసం వారు తినొచ్చని చెప్పినట్లు ఆరోపించారు. యూపీలోని మురాదా బాద్ జిల్లా బిలారీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆదిత్యనాథ్ మాట్లాడారు. గోమాం సం తినే హక్కు ఇస్తామంటూ కొంతమంది హామీలు ఇస్తున్నారు. కానీ మన సంస్కృతి ఆవును గోమాతగా పేర్కొంటుంది. ఆవులను కసాయి వాళ్లకు ఇచ్చేస్తామంటున్నారు. దీన్ని భారత్ ఎప్పటికీ అంగీకరించదు అని విమర్శలు చేశారు.