calender_icon.png 25 April, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పహల్గాం మృతులకు కాంగ్రెస్ కొవ్వత్తుల నివాళి

24-04-2025 10:07:02 PM

కాటారం (విజయక్రాంతి): కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన భారతీయుల ఆత్మశాంతికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రమైన అంబేద్కర్ చౌరస్తాలో కాటారం మండల కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించి, కొవ్వత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుద్దిల్ల శీను బాబు మాట్లాడుతూ... పర్యాటకులపై పైశాచికంగా దాడి చేసిన వారిని ఉరితీయాలని అన్నారు.

దేశం యావత్తు దిగ్బ్రాంతి చెందిన ఉగ్రవాదుల దాడిని రాజకీయ పార్టీల కతీతంగా ఖండించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోదీ సర్కార్ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాబు గౌడ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు చీమల సందీప్, మండల అధ్యక్షులు చిటూరి మహేష్ గౌడ్, నాయకులు చల్లా తిరుపతిరెడ్డి, జాడి మహేశ్వరి, వామన్ రావు, నవీన్ రావు, వంశవర్ధన్ రావు, బండి రమేష్, కొండ రాజమ్మ, లింగమల్ల శారద, దుర్గయ్య, ఐత శకుంతల, కడారి విక్రమ్, గద్దె సమ్మిరెడ్డి, మాచర్ల రాజేందర్, భూపెల్లి రాజు, కొట్టే శ్రీహరి, అమీర్, ఇంతియాజ్, అయితే రాజిరెడ్డి కోమల, తదితరులు పాల్గొన్నారు.