న్యూఢిల్లీ,(విజయక్రాంతి): దేశ రాజధానిలో ఢిల్లీలో ఫిబ్రవరి 5న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో విజయం మాదంటుమది అన్నట్లు పార్టీలు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఢిల్లీ నిరుద్యోగ యువత(Delhi Unemployed Youth)ను దృష్టిలో ఉంచుకొని మూడో హామీని ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువ ఉడాన్ యోజన కింద ప్రతి విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఒక సంవత్సరం పాటు నెలకు రూ.8,500 ఇస్తామని హామీ ఇచ్చింది. ఫిబ్రవరిలో జరిగే కీలకమైన ఎన్నికలకు ముందు, జనవరి 12న పార్టీ ఈ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఢిల్లీ ప్రజలు ఫిబ్రవరి 5న కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నారు. అయితే ఢిల్లీ ప్రజలకు తాము కొన్ని హామీలను అందించబోతున్నామని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ పేర్కొన్నారు.
నిరుద్యోగులకు ఇది కేవలం ఆర్థిక సహాయం కాదు. వారు శిక్షణ పొందిన పరిశ్రమలో వారికి ఉద్యోగాలు ఇచ్చేందకు ప్రయత్నిస్తామని కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections)కు ముందు, పార్టీ అధికారంలోకి వస్తే అంకితమైన ఛత్ ఘాట్ నిర్మిస్తామని హామీ ఇచ్చి పూర్వాంచలి ఓటర్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ వ్యూహాత్మక చర్య తీసుకుంది. ఈ ప్రకటనను బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు అఖిలేష్ ప్రసాద్ సింగ్(Bihar Congress President Akhilesh Prasad Singh) విలేకరుల సమావేశంలో వెల్లడించారు. యమునా నది ఒడ్డున ఉన్న ఛత్ ఘాట్ ప్రణాళికలను ఆయన వివరించారు. గత సంవత్సరం మరణించిన దిగ్గజ బిహారీ జానపద గాయకురాలు శారదా సిన్హా ఘాట్ గౌరవార్థం ఈ ఘాట్‌కు శారదా సిన్హా ఘాట్ అని పేరు పెట్టనున్నాట్లు ఆయన స్పష్టం చేశారు.
పూర్వాంచలి ఓటర్లను రాజకీయ లాభం కోసం బీజేపీ(BJP), ఆప్(APP) పార్టీలు దోపిడీ చేస్తున్నాయని సింగ్ విమర్శించారు. అదే సమయంలో వారు సమాజానికి గౌరవం, గుర్తింపును అందించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఢిల్లీలోని గణనీయమైన ఓటర్లతో, ముఖ్యంగా పూర్వాంచలి జనాభాతో వారి సాంస్కృతిక, మతపరమైన అవసరాలను తీర్చడం ద్వారా కనెక్ట్ అవ్వడానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నాన్ని ఈ చర్య తొడ్పడింది. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 8న జరుగుతుంది. 2015-2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ వరుసగా 67 - 62 స్థానాలను గెలుచుకుంది. 2015లో బీజేపీ మూడు, 2020లో ఎనిమిది స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడం గమనార్హం.