calender_icon.png 23 March, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోశమ్మ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది

22-03-2025 08:52:39 PM

ఏఐసిసి కార్యదర్శి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి...

పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లా నాగులపాటి అన్నారంకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త నకిరేకంటి వెంకన్న (కెకె) మాతృమూర్తి రోశమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ కార్యదర్శి రాం సర్వోత్తమ రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్  కొప్పుల వేణారెడ్డిలు విచ్చేసి మృతురాలు రోశమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతురాలు రోశమ్మ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు.

సంతాపం తెలిపిన వారిలో మాజీ మార్కెట్ చైర్మన్ తూముల భుజంగరావు, డైరెక్టర్ అర్తి కేశవులు, మాజీ జెడ్పిటిసి పిన్నాని కోటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు దొంగరి వెంకన్న, ముత్తినేని శ్రీనివాస్, బొమ్మకంటి కృష్ణయ్య, మామిడి శ్రీనివాస్, కత్తి రవీందర్, బాదే శ్రీనివాస్, తీగల ఉపేందర్, దేవులపల్లి అంజయ్య, వీరబోయిన చిన్న సైదులు, మున్న లింగయ్య, చెరుకుపల్లి ఉపేందర్, మీసాల ప్రశాంత్ కుమార్, మామిడి నాగయ్య తదితరులు ఉన్నారు.