19-02-2025 08:28:01 PM
టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్...
బాన్సువాడ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో సంక్షేమంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) అన్నారు. బుధవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా ముఖాముఖి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. భవిష్యత్తులో బీసీ బిడ్డలకు అవకాశాలు రావాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పెంచాలని పిలుపునిచ్చారు. గత పది సంవత్సరాలుగా ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారంలోకి రాగానే 50వేల ఉద్యోగాలు కల్పించారన్నారు.
24 ఏళ్ల తర్వాత పిఈటిలకు పదోన్నతులు కల్పించారని అన్నారు ప్రతి పట్టభద్రునికి 3 లక్షల రూపాయల వరకు ఆరోగ్య భీమా సౌకర్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తుందన్నారు. రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) మాట్లాడుతూ... మంచి విద్యావేత్త నరేందర్ రెడ్డిని పట్టభద్రులు గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లు పాలకవర్గ సభ్యులు, అంజిరెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.