calender_icon.png 29 March, 2025 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ఆదుకుంటుంది

26-03-2025 07:26:02 PM

కొండపాక (విజయక్రాంతి): గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలం ఆత్మ కమిటీ డైరెక్టర్లుగా జప్తి నాచారం గ్రామానికి చెందిన పబ్బోజు వీరబ్రహ్మం, మర్పడగ గ్రామానికి చెందిన ఆకారం సరోజ, కొండపాక గ్రామానికి చెందిన, దుంపలపల్లి శ్రావణ్, లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను రైతులకు తెలియజేయడంలో ముందుంటామని, రైతులను కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందే దిశగా పనిచేస్తామని తెలిపారు.

మాపై నమ్మకంతో కొండపాక మండల ఆత్మ కమిటీ డైరెక్టర్లుగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ  మంత్రి కొండ సురేఖ, మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు విజయకుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు వడ్లకొండ రవీందర్ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.