06-03-2025 08:43:16 AM
మహా ముత్తారం మండలంలో మృతుల కుటుంబాలకు పరామర్శలో దుద్దిళ్ల శ్రీను బాబు
మంథని,(విజయక్రాంతి): బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు(Minister Sridhar Babu brother) కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు శ్రీనుబాబు(Duddilla Srinu Babu) అన్నారు. భూపాలపల్లి జిల్లా మాహా ముత్తారం మండలంలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను శ్రీనుబాబు పరమర్శించారు. రేగులగూడెం మాజీ సర్పంచ్ బూసి దేవేందర్ రెడ్డి ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను, అలాగే మీనాజీపేట గ్రామంలో పింగిళి రవీందర్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను,
అలాగే కొత్త రేగుల గూడెం లో గుడిపాటి రవీందర్ రెడ్డి మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను, అనంతరం బొర్ల గూడెం గ్రామంలోని చకినాల లచ్చయ్య ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను, అలాగే స్తంభంపల్లి (పీకే) గ్రామంలో సర్పంచ్ మేడిపల్లి దుర్గ ప్రసాద్ కుమారుడు వినయ్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను, అలాగే రేగులగూడెం గ్రామంలో కోడి సంజీవ్ ఇటీవల మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను, అలాగే ప్రేమ్ నగర్ గ్రామంలో ఇటీవల ముకులోతు కన్నీబాయ్ అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను, అలాగే యామనపల్లి గ్రామంలో అట్టెం వెంకయ్య అనారోగ్య సమస్యలతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుల చిత్రపటాల వద్ద ఘనంగా నివాళులర్పించారు. శ్రీను బాబు వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.