సూర్యాపేట, ఫిబ్రవరి 5 : కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కొప్పుల వేణారెడ్డి, డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ లు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వైట్ హౌస్ లో ఆత్మకూరు (ఎస్ )మండలం ఇస్తలాపురం నూతనముగా ఏర్పడిన గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు. అనంతరం వారిని పూలమాలలు శాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు బీసు లింగయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు కప్పల చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులు ఇరుగు మల్లయ్య, దాసరి మహేష్, ప్రధాన కార్యదర్శి దామనూరి శ్రీనివాస్, మున్నా లింగయ్య తదితరులు పాల్గొన్నారు.